తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

www.telugumaterials.com

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1968 నుంచి రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అనేక రూపాల్లో ఉద్యమించారు. ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్యాయాలను ఎదిరించి, చట్టబద్ధ హక్కులను పొందడానికి.. వీలైన అన్ని మార్గాల ద్వారా ప్రజలను సంఘటితం చేశారు. మరోవైపు కొన్ని ఉద్యమ సంస్థలు, రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను తమకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి. కానీ, తెలంగాణ ప్రజలు స్వార్థ రాజకీయ నాయకత్వాల కింద ఏర్పాటైన ఉద్యమ సంస్థలు, వేదికల ద్వారా కూడా అనూహ్యంగా చైతన్య స్ఫూర్తిని పొంది, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1968లో ఒక క్రమానుగత విప్లవ స్ఫూర్తితో ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ప్రజలందరూ ఇందులో పాల్గొన్నారు. 1969లో తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు. కొంతమంది ప్రముఖుల నాయకత్వంలో తెలంగాణ సమాజమంతా చైతన్యవంతమై స్వయం పాలన కోసం ఆత్మార్పణలకు కూడా వెనుకాడకుండా ఉద్యమించారు. దశలో రాజకీయంగా ఎత్తుగడలు వేసి ఉద్యమాన్ని నీరుగార్చారు. ఇలాంటి అనూహ్య పరిణామాల పట్ల ప్రజలు విసుగు చెందారు. అయినప్పటికీ అనేక మంది మేధావులు, రచయితలు, కవులు వివిధ మార్గాల ద్వారా ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ ప్రత్యేక తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచారు. దిశగా ఆచార్య జయశంకర్ విశేష కృషి చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చితెలంగాణ రాష్ట్ర సమితిపార్టీని స్థాపించారు.
కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం అనూహ్యంగా ఊపందుకుంది. ఆయన తన వాక్చాతుర్యం, రాజకీయ ఎత్తు గడలతో రాష్ట్ర సాధన దిశగా తీవ్ర కృషి చేశారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, రాజకీయ పార్టీలు ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. 2009 డిసెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరాంను ఎన్నుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన - ముఖ్యమైన అంశాలు
·         హైదరాబాద్ సంస్థానం భారత్లో వీలినమైన తేది 1948 సెప్టెంబర్ 17.
·         తెలంగాణ ప్రాంతంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన తేది 1952 ఆగస్టు 5.
·         భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించిన తేది 1953 డిసెంబర్ 22.
·         1960లో ప్రాంతీయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన వారు - కె.అచ్యుత రెడ్డి.
·         తొలి దశ రాజకీయ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1968.
·         తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన తేది 1969 జనవరి 13.
·         మర్రి చెన్నారెడ్డినితెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) అధ్యక్షుడిగా ఎన్నుకున్న తేది 1969 మే 22.
·         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించి, అమలు పరచాలని నిర్ణయించిన తేది 1973 సెప్టెంబర్ 21.
·         భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్నుఫజల్ అలీనేతృత్వంలో ఏర్పాటు చేశారు.
·         1974 మే 3 ఆరు సూత్రాల పథకంలో భాగంగా 32 రాజ్యాంగ సవరణ ద్వారా 371-(డి), 371() అధికరణలను కొత్తగా చేర్చారు.
·         610 జీవోను పరిశీలించడానికి ఎన్.టి. రామారావు హయాంలో రాష్ట్ర ప్రభుత్వంసుందరేశన్అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
·         కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి కన్వీనర్గా 1990లోతెలంగాణ ఫోరంఏర్పడింది.
·         తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1997.
·         తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తేది 2001 ఏప్రిల్ 27.
·         ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభించిన తేది 2009 నవంబర్ 29.
·         మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసిన తేది 2009 డిసెంబర్ 4.
·         ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన తేది 2010 ఫిబ్రవరి 3.
·         శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.
·         మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినమిలియన్ మార్‌‌నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది 2011 మార్చి 10.
·         మలిదశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ప్రారంభమైన తేది 2011 సెప్టెంబర్ 13.
·         హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జేఏసీతెలంగాణ మార్‌‌నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన రోజు 2012 సెప్టెంబర్ 30.
·         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై చర్చ చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 2013 మార్చి 21 జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యక్రమం పేరు - సడక్ బంద్.
·         హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించిన తేది 2013 జూలై 30.
·         నాటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంట్లో ప్రకటించిన రోజు 2013 ఆగస్టు 5.
·         ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగస్టు 6 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ - ఆంటోని కమిటీ.
·         ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్బాబు నేతృత్వంలోసేవ్ ఆంధ్రప్రదేశ్పేరుతో 2013 సెప్టెంబర్ 21 సమైక్యాంధ్ర సభను నిర్వహించిన ప్రదేశం - ఎల్.బి. స్టేడియం, హైదరాబాద్.
·         కేంద్ర హోం-శాఖ తెలంగాణ బిల్లును రూపొందించిన తేది - 2013 అక్టోబర్ 3.
·         సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమైక్యసభ జరుగుతుండగాజై తెలంగాణఅని నినదించిన కానిస్టేబుల్ పేరు - శ్రీనివాస్.
·         తెలంగాణ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రి మండలి అమోదం తెలిపిన రోజు 2013 డిసెంబర్ 5.
·         తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక విమానంలో పంపించిన తేది 2013 డిసెంబర్ 12.
·         తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన రోజు 2014 ఫిబ్రవరి 18.
·         కె. చంద్రశేఖర్రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2014 జూన్ 2. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల సంఖ్య 11 మంది.
·         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు.
·         కేసీఆర్ ఒక వైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే మరో వైపు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవడానికి మేధోమథన సదస్సును నిర్వహించిన ప్రదేశం - వరంగల్.
·         మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు - జె.సి.దివాకర్రెడ్డి, టి.జి. వెంకటేష్.
·         తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యేల సంఖ్య - 87 మంది (మిగతా వారు తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా తెలియజేశారు)
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
) 2005
బి) 2004
సి) 2006
డి) 2007
·         Ans: 2005

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది?
) ఉత్తమ్కుమార్ రెడ్డి
బి) రోశయ్య
సి) రాజనర్సింహ
డి) శ్రీకృష్ణ
·         Ans: రోశయ్య
3. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
) 2011 ఫిబ్రవరి
బి) 2010 ఫిబ్రవరి 4
సి) 2010 ఫిబ్రవరి 3
డి) 2011 ఫిబ్రవరి 4
·         Ans: 2010 ఫిబ్రవరి
4. శ్రీకృష్ణ కమిటీ తన అధ్యయన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రికి సమర్పించిన తేది?
) 2011 జనవరి
బి) 2010 డిసెంబర్ 31
సి) 2010 డిసెంబర్ 29 
డి) 2010 డిసెంబర్ 30
·         Ans: 2010 డిసెంబర్ 30
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లుపై రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారు?
) 2014 మార్చి 8
బి) 2014 మార్చి 1
సి) 2014 మార్చి 3
డి) 2014 మార్చి 5
·         Ans: 2014 మార్చి 1
6. ‘తెలంగాణ సాధన సమితిఉద్యమ సంస్థను ఏర్పాటు చేసినవారు?
) ఆలె నరేంద్ర
బి) కేశవరాజ్
సి) విజయశాంతి
డి) ఆలె శ్యామ్ జీ
·         Ans: ఆలె నరేంద్ర
7. తెలంగాణ రాజకీయ జేఏసీ ఎప్పుడు ఆవిర్భవించింది?
) 2009
బి) 2010
సి) 2011
డి) 2008
·         Ans: 2009
8. భారతీయ జనతా పార్టీకాకినాడ తీర్మానంచేసిన సంవత్సరం?
) 2002
బి) 2004
సి) 1998
డి) 1996
·         Ans: 1998

9. ‘తెలంగాణ ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మలిచింది ఎవరు?
) మదన్మోహన్
బి) మర్రి చెన్నారెడ్డి
సి) అచ్యుతా రెడ్డి
డి) కె.వి. రంగారెడ్డి
·         Ans: మర్రి చెన్నారెడ్డి
10. కిందివారిలో తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించినవారు?
) చొక్కారావు
బి) హయగ్రీవాచారి
సి) అచ్యుతా రెడ్డి
డి) గౌతు లచ్చన్న
·         Ans: అచ్యుతా రెడ్డి

TSLPRB Previous Papers With Answer Key Download In Telugu.

Download Group 4 Material In Telugu