మొక్కలు- ఉపయోగాలు
అనాది కాలం మానవునికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మానవ నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు మనుగడ మొత్తం మొక్కలపైనే ఆధారపడి ఉంది. ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించే కలప మొదలు.. వివిధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీ వరకు మొక్కలు వివిధ రూపాల్లో మానవునికి ఉపయోగపడుతున్నాయి. |
జీవశాస్త్రం మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణ ఔషధాలు, కలప, అలంకరణ వస్తువులు, నూనె, వనస్పతి మొదలైనవి. వివిధ రూపాల్లో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం వివిధ రూపాల్లో మొక్కల నుంచి లభిస్తుంది. వీటిలో వరి, గోధుమ, జొన్న, సజ్జ, బార్లీ, మొక్కజొన్న వంటివి ధాన్యాలు. కంది, పెసర, మినుములు, శెనగ, అలసందలు, బీన్స్ మొదలైనవి పప్పు ధాన్యాలు (ఇవి.. పోయేసి, లెగ్యూమినేసి మొక్కల నుంచి లభిస్తున్నాయి). అంతేకాకుండా వీటిలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బియ్యం గింజలపై ఉండే అల్యురాన్ పొరలో B1 విటమిన్ అధికంగా ఉంటుంది. ఆధునిక జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా రూపొందించిన గోల్డెన్ రైస్‌లో విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. పప్పు ధాన్యాల్లో శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దుంపలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు వంటివి కూడా మొక్కల నుంచి లభిస్తున్నాయి. వీటిలో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ఉదాహరణకు దుంపల్లో కార్బోహైడ్రేట్స్; ఆకుకూరల్లో కాల్షియం, ఐరన్; ఎండు ఫలాల్లో ఫై వంటి పోషకాలు లభ్యమవుతాయి. చెరకులో అతి తీపిదనాన్ని కలిగిన ఫ్రక్టోస్; మామిడి, బొప్పాయి వంటి ఫలాల్లో విటమిన్-A ఉంటుంది. సిట్రస్, ఉసిరి, జామ వంటి వాటిలో విటమిన్-C అధికంగా ఉంటుంది. మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల ఫలాలు కూడా మొక్కల నుంచే లభిస్తున్నాయి. ప్రకృతిలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. వర్షాలు కురవడానికి మొక్కలు ఎంతగానో తోడ్పడతాయి. ఇళ్ల నిర్మాణానికి వాడే కలప, ఫర్నీచర్, అలంకరణ వస్తువుల తయారీలో టేకు, మహాగని, వేప, తుమ్మ, రోజ్‌వుడ్ వంటి మొక్కల భాగాలను ఉపయోగిస్తారు. సంగీత వాయిద్యాలను రూపొందించడానికి ఎర్ర చందనం మొక్కలను వినియోగిస్తారు. అలంకరణ కోసం ఇంటి ముందు, పార్కుల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో మల్లె, బంతి, చేమంతి, గులాబి, గన్నేరు, నైట్ క్వీన్, డేకింగ్, విష్ణుచక్రం, మందార వంటి పూలమొక్కలతోపాటు ఫెర్న్, క్రోటాన్ వంటి పుష్పించని మొక్కలు కూడా ఉంటున్నాయి. నైట్ క్వీన్ వంటి మొక్కలు మంచి సువాసనను వెదజల్లుతాయి. మనీ ప్లాంట్, క్రోటాన్ వంటి మొక్కలను నీడలో పెంచుతారు. ఔషధాలుగా ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఔషధ మొక్కల గురించి అధర్వణ వేదంలో కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్న మొక్కలను పరిశీలిస్తే.. వేప నుంచి లభించే నింబిన్, నింబిడిన్ అనేవి చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయి. వేపను ‘హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా’ అంటారు. తులసి నుంచి కాంపర్ అనే ఔషధం లభిస్తుంది. ఇది చెవి పోటు, శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. లావెండర్ నుంచి సుగంధ తైలాలు లభ్యమవుతాయి. డిజిటాలిస్ నుంచి లభించే డిజిటాలిన్ హృదయ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. అట్రోపా బెల్లడోనాలో ఉండే ఆట్రోపిన్ కంటి పరీక్షల్లో తోడ్పడుతుంది. సింఖోనా మొక్క బెరడు నుంచి లభించే క్వినైన్ మలేరియా వ్యాధిని నయం చేస్తుంది. రక్కీసు లేదా నల్ల మందు మొక్క కాయలో ఉండే మార్ఫీన్ నొప్పిని తగ్గించి నిద్ర పోవడానికి తోడ్పడుతుంది. సర్పగంధి వేరులోని రిసర్పిన్ను జీర్ణకోశ వ్యాధులు, పాము కాటేసిన సమయంలో చికిత్సకు ఉపయోగిస్తారు. దతూర పత్రాల నుంచి లభించే స్ట్రమోనియంను ఆస్తమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను నయం చేస్తుంది. పెన్సీలియం క్రైపోజినం అనే శీలింధ్రం నుంచి పెన్సిలిన్ యాంటీ బయాటిక్‌ను తయారు చేస్తున్నారు. పసుపు ఒక యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. ఇది అల్సర్, జాండీస్, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్‌ను గౌట్, రుమాటిజం వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఫేరులా వేళ్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుంది. అశ్వగంధ వేర్లు దగ్గు, రుమాటిజం, అల్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి. అల్లం, శొంటి అనేవి పన్ను నొప్పి, కంటి సంబంధ వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. స్మైలాక్స్ నుంచి లభించే సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలకు పనిచేస్తుంది. దాల్చిన చెక్క డయేరియా, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఎపిడ్రిన్ ఆల్కలాయిడ్.. జలుబు, ఆస్తమా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అట్రోపా నుంచి లభించే అట్రోపిన్.. ప్లాస్టర్స్ తయారీకి తోడ్పడుతుంది. క్రోకస్ (కుంకుమ పువ్వు) కీలం, కీలాగ్రాలు, నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి. పారిశ్రామికంగా పారిశ్రామికంగా కూడా మొక్కలు వివిధ రూపాల్లో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పేపర్ తయారీలో సైపరస్ పల్ప్ అనే మొక్కను వినియోగిస్తున్నారు. టేకు, మేఖేలియా వంటి వాటి నుంచి ఫ్లైవుడ్‌ను, పెన్సిల్ వంటి వాటిని జానిపెరస్ మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. మల్బరీ, డాల్బిర్జియా వంటి మొక్కల నుంచి హాకీ స్టిక్స్‌ను రూపొందిస్తున్నారు. బిలియర్డ్స్ క్యూస్ తయారీలో ఏసర్ వంటి మొక్కలు తోడ్పడుతున్నాయి. అదే విధంగా సబ్బుల పరిశ్రమలో కానుగ, క్యాండిల్స్ తయారీలో మదుక (ఇప్ప), పామాయిల్ కోసం ఇలేయిస్ వంటి మొక్కలను ఉపయోగిస్తున్నారు. రెసిన్స్ అనేది పైనఫ్ వంటి మొక్కల నుంచి తయారవుతుంది. దీన్ని వార్నిష్, పెయింటింగ్స్‌లో ఉపయోగిస్తారు. టానిన్స్ను ఔషధాల తయారీ, తోళ్ల శుద్ధిలో వినియోగిస్తారు. ఇంక్ (సిరా)ను క్వెర్కస్ టానిన్స్ నుంచి తయారు చేస్తారు. లేటెక్స్ వంటి పదార్థం నుంచి రబ్బర్‌ను రూపొందిస్తారు. ఉదాహరణకు హేవియా, ఫైకస్. కొన్ని మొక్కల నుంచి నేరుగా రసాయనిక పదార్థాలు తయారవుతాయి. నిమ్మ నుంచి ఆస్కార్బిక్ ఆమ్లం, చింత పండు నుంచి టార్టారిక్ ఆమ్లం ఉత్పన్నమవుతాయి. వీటితోపాటు కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపన కు దోహదం చేయడంతోపాటు పంట దిగుబడిని అధికం చేస్తాయి. నాస్టాక్, అనబినా, రైజోజోబియం బ్యాక్టీరియాలు ఈ చర్యలో ఎక్కువగా ఉపయోగపడతాయి. క్రిసాంథిమం (పైరిత్రిన్) మొక్కలు, కొన్ని రకాల బ్యాక్టీరియాల నుంచి బయో ఫెస్టిసైడ్స్ తయారవుతున్నాయి. సాంకేతికత తోడుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త రకం మొక్కలను సృష్టిస్తున్నారు. ఇవి మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు బీటీ కాటన్, గోల్డెన్ రైస్ వంటి మొక్కలు. అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్, కణజాల వర్థనం వంటి పద్ధతుల్లో కూడా నూతన మొక్కలను రూపొందిస్తున్నారు. జూట్, గోగునార, ఆలొవీరా, కొబ్బరి వంటి మొక్కల నుంచి నారలు లభిస్తాయి. పత్తి నుంచి లభించే కేశాల్లో సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. పొంగామియా (కానుగ), జట్రోపా వంటి మొక్కల నుంచి బయో డీజిల్‌ను తయారుచేస్తారు. |