Famous Women In History(చరిత్రలో ప్రముఖ మహిళలు)

Download RRB Group-D material In Telugu Version









QUESTION ANSWER
యాజ్ఞవాల్కవ్యునితో వాదించిన వేద కాలం నాటి మహిళ?గార్గి
పార్శ్వనాథుడి తల్లి పేరు? రాణి వామల
వర్థమాన మహావీరుని తల్లి ఎవరు?త్రిశాల దేవి
వర్థమానుని కుమార్తె పేరు? అనోజ్ఞ (ప్రియదర్శిని)
బుద్ధుడి తల్లి ఎవరు?మహామాయ
బుద్ధుడిని పెంచిన తల్లి ?ప్రజాపతి గౌతమి
బుద్ధుడికి పాయసాన్ని ఇచ్చిన మహిళ?సుజాత
బుద్ధుడి భార్య పేరు?యశోధర
వర్థమాన మహావీరుని భార్య పేరు?యశోద
బుద్ధుని చర్యలతో మారిన అజాతశత్రువు ఆస్థాన నర్తకి?ఆమ్రపాలి
చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్న గ్రీకు వనిత ?హెలీనా (హేలన్‌)
అశోకుడి తల్లి పేరు?సుభద్రాంగి
అశోకుని పట్టపు రాణి?ఆనంది మిత్ర
శ్రీలంకలో బౌద్ధ ప్రచారానికి వెళ్లిన అశోకుని కుమార్తె పేరు?సంఘమిత్ర
మౌర్య సామ్రాజ్య పతనానికి కారకుడు అశోకుడేనని తెలిపిన చరిత్రకారిణి?రొమిల్లా థాపర్‌
మొదటి శాతకర్ణి గురించి వివరిస్తోన్న నానాఘట్‌ శాసనాన్ని వేయించింది?నాగానిక
నాసిక్‌ శాసనాన్ని వేయించింది?గౌతమీ బాలశ్రీ
అజాతశత్రువు వివాహం చేసుకున్న కోసల రాజు ప్రసేనజిత్తు కుమార్తె?వజీరా
బౌద్ధ మతాన్ని స్వీకరించిన శ్రావస్తి నగర స్త్రీ?విశాఖ
పూనా శాసనాన్ని వేయించిన ప్రముఖ మహిళ?ప్రభావతీ గుప్తా
హర్షుడి తల్లి పేరు?యశోమతి
హర్షుడి సోదరి పేరు?రాజశ్రీ
జైన మతాన్ని ఆదరించిన వేంగీ చాళుక్యరాజు కుబ్జ విష్ణువర్థనుడి భార్య?అయ్యణ్ణ మహాదేవి
విమాలాదిత్యుడు అనే వేంగి రాజు వివాహం చేసుకున్న చోళ రాజరాజు–1 కుమార్తె?కుందవ్వ
రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న చోళ రాజు మొదటి రాజేంద్రుడి కుమార్తె ?అమ్మంగదేవి
ప్రముఖ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుని కుమార్తె పేరు? లీలావతి
బోధి వృక్షం క్షీణించడానికి విష ప్రయోగం చేయించిన అశోకుడి భార్య?తిశ్యరక్షిత (రెండో పట్టమహిషి)
బౌద్ధ మతానికి సేవ చేసి, విజయపురి, నాగార్జున కొండల్లో కీర్తి గడించిన బోధిశర్మ మేనకోడలు?ఉపాశిక బోధిశ్రీ
శ్రీశాంత మూలుడు అనే ఇక్ష్వాక రాజు సోదరి పేరు?శాంతిశ్రీ
శ్రీశాంత మూలుడి కుమార్తె?అడవి శాంతిశ్రీ
ఇంద్రపాల నగరం (నల్గొండ)లో బౌద్ధులకు మహా విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాణి?పరమ భట్టారిక
వేములవాడ చాళుక్యు రాజు రెండో నరసింహుడు వివాహం చేసుకున్న మూడో ఇంద్రుని కుమార్తె?జాకవ్వ
వీరపురుషదత్తుడు అనే ఇక్ష్వాక రాజు కుమార్తె పేరు?కొండ బలసిరి
రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకున్న రామగుప్తుని భార్య?ధృవాదేవి
రెండో చంద్రగుప్తుడిని వివాహం చేసుకున్న నాగ వంశ రాణి?కుబేర నాగ
విజయవాడలో నెడుంబి బసతిని నిర్మించింది?అయ్యణ్ణ మహాదేవి
మొదటి చాళుక్య భీముడు (వేంగి) ఆదరించిన ఏ కవయిత్రి అత్తిలిని బహుమానంగా పొందింది?చల్లవ్వ
రెండో చాళుక్య భీముడు (వేంగి) వివాహం చేసుకున్న స్త్రీలు?ఉర్జివ (అంకందేవి), లోకాంబిక
నలగామరాజుకు ప్రధానిగా పనిచేసింది?నాగమ్మ
బాలచంద్రుని భార్య?మాంచాల
బయ్యారం చెరువు శాసనం వేయించింది?మైలాంబ
మొదటి బేతరాజు అనే కాకతీయ రాజుకు కళ్యాణి చాళక్యుల నుంచి∙కొంత భూ భాగాన్ని ఇప్పించింది?మిరియాల కామసాని
సంగమ యుగం నాటి గొప్ప కవయిత్రి?అవ్వయార్‌
కాకతీయ రుద్రదేవుడు వివాహం చేసుకున్న పానగల్లు యువరాణి?పద్మావతి
గణపతిదేవుడును వివాహం చేసుకున్న అయ్యచోడుని కుమార్తెలు?నారాంబ, పేరాంబ
దక్షిణాదిలో ఏకైక హిందూ పాలకురాలు?రాణి రుద్రమదేవి
రుద్రమదేవి కుమార్తెలు?మమ్ముడమ్మ, రుయ్యమ, రుద్రమ
రెండో ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకి?మాచల్దేవి
శ్రీకృష్ణదేవరాయల కుమార్తె?మోహనాంగి
వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుని సోదరీమణులు? హర్షిశ్రీ, శాంతిశ్రీ
రెండో ప్రతాపరుద్రుడి సేనలను ఎదిరించిన మగువలు?సమ్మక్క, సారక్క
రాష్ట్రకూట రాజు ధృవుడు వివాహం చేసుకున్న వేంగీ చాళుక్య 4వ విష్ణువర్థనుని కుమార్తె?శీల మహాదేవి
రెండో నందివర్మ అనే పల్లవ రాజును వివాహం చేసుకున్న దంతిదుర్గుని కుమార్తె?రేవతిదేవి
సుభద్రా కల్యాణం రాసిన అన్నమయ్య భార్య? తాళ్లపాక తిమ్మక్క
కంచర్ల గోపన్న (భక్త రామదాసు) భార్య?కమల
శ్రీకృష్ణదేవరాయల భార్యలు?చిన్నాదేవి, తిరుమలదేవి
మొదటి దేవరాయలు అనే విజయనగర రాజు ఎవరి కోసం బహమనీ రాజు ఫిరోజ్‌షాతో యుద్ధం చేశాడు?నేహాల్‌
ఇనుగుర్తిలో గోపాలకృష్ణుడి ఆలయాన్ని నిర్మించిన గణపతిదేవుడి సోదరి?మైలాంబ
రామనాథాలయం (కరీంనగర్, యెల్గేడు)కు కానుకలు సమర్పించిన రెండో ప్రతాపరుద్రుని దేవేరి?లక్ష్మీదేవి
రాధికాస్వాంతనం రాసింది?ముద్దు పళని
గణపతి దేవుడిని వివాహం చేసుకున్న యాదవుల యువరాణి?సోమలదేవి
కశ్మీర్‌ పాలనలో పాలుపంచుకున్న మహిళ?దిద్దాదేవి
కలువచేరు శాసనాన్ని వేయించింది?అనితల్లి
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వివాహం చేసుకున్న హిందూ మహిళ?భగీరథీదేవి
శాతవాహనుల కాలం నాటి కవయిత్రులు?రేవతి, మాధవి, చల్లువ, బోదిశ్వ
బొబ్బిలి యుద్ధం చేసి వీర మరణం పొందిన రంగారావు భార్య?మల్లమ్మ
రాచకొండలో ‘నాగ సముద్రం’ను నిర్మించింది?నాగాంబిక
గోల్కొండలో ఆపద్ధర్మ పాలన సాగించిన జంషీద్‌ కులీ భార్య?బిల్కిస్‌ జహాన్‌
మహ్మద్‌ కులీ కుతుబ్‌షా ఏకైక కుమార్తె ?హయత్‌ భక్షీ బేగం
మహ్మద్‌ కులీ కుతుబ్‌షా వివాహం చేసుకున్న హిందూ మహిళ?భాగమతీదేవి
పృథ్వీరాజ్‌ చౌహాన్‌ భార్య పేరు?రాణి సంయుక్త
ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు?రజియా సుల్తానా
గుండేశ్వరాలయాన్ని నిర్మించిన గోన బుద్ధారెడ్డి సోదరి?కుప్పాంబిక
అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ వివాహం చేసుకున్న కర్ణ దేవుని భార్య?కమలాదేవి
రామాయణాన్ని తెలుగులో రాసిన మహిళ?మొల్ల
అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ చర్యల వల్ల జౌహార్‌ చేసి మరణించిన రతన్‌సింగ్‌ భార్య?రాణి పద్మిని
సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన నర్తకి?భోగిని
కృష్ణ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారిణి?మీరాబాయి
మన్నారు దాస విలాసం రాసింది ?పసుపులేటి రంగాజమ్మ
షాజహాన్‌ తల్లి పేరు?తాజ్‌ బీబీ బిల్కిస్‌ మకానీ
రెడ్డిరాజు కుమారగిరిరెడ్డి ఆస్థాన నాట్యకత్తె?లకుమాదేవి
తుక్క పంచమి రాసింది?తక్కమాంబ
ప్రపంచ ప్రఖ్యాత తొలి అనస్థీషియనిస్ట్‌ అయిన భారత మహిళ?డా.రూపబాయి పుర్ధోంజీ
‘మధురా విజయం’ను రాసిన కుమార కంపన భార్య?గంగాదేవి
వరదాంబిక పరిణయం రాసింది?తిరుమలాంబ
శ్రీకృష్ణదేవరాయల తల్లి?నాగులాంబ (నాగాంబ)
హుమయూన్‌ నామా రాసింది?గుల్‌బదన్‌ బేగం
అక్బర్‌ వివాహం చేసుకున్న అంబర్‌ రాజ్య యువరాణి?మర్యం–ఇ–జమానీ
అక్బర్‌ని పెంచిన తల్లి?మహం అంగా
గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్‌షా పోషించిన కళావతులు?తారామతి, ప్రేమామతి
హయత్‌నగర్‌ ఎవరి పేరు మీద నిర్మితమైంది? హయత్‌ భక్షీ బేగం
జహంగీర్‌ వివాహం చేసుకున్న వితంతువు పేరు?నూర్జహాన్‌
అక్బర్‌ను ఎదిరించిన అహ్మద్‌నగర్‌ రాణి?చాంద్‌ బీబీ
అక్బర్‌ను ఎదిరించిన గోండ్వానా రాణి పేరు?దుర్గావతి
షేర్షా వివాహం చేసుకున్న వితంతువు?లాడ్‌ మాలిక
అక్బర్‌ కాలం నాటి మాళ్వా ప్రాంత సంగీతకారిణి? రూపమతి
అక్బర్‌ తల్లి పేరు?హమీదా భాను బేగం
షాజహాన్‌ వివాహం చేసుకున్నlఅసఫ్‌ఖాన్‌ కుమార్తె?ముంతాజ్‌ బేగం
షాజహాన్‌ సోదరుడు షహ్రియార్‌ వివాహం చేసుకున్న నూర్జహాన్‌ కుమార్తె?లాడ్లీ బేగం
షాజహాన్‌ (ఖైదీగా ఉన్నప్పుడు)కు సేవ చేసిన కుమార్తె?జహనార
ఛత్రపతి శివాజీ భార్యలు?సౌరయబాయి, షాహిబాయి
రాజకీయ రంగంలో కీర్తి గడించిన షాజహాన్‌ కుమార్తె?రోషనార
కాలిగ్రఫీ అనే సుందరంగా రాసే విద్యలో నిపుణురాలైన ఔరంగజేబు కుమార్తె?జేబున్నీసా
మొదటి బాజీరావు (పీష్వా) ప్రేమించిన మహిళ?మస్తానీ
శివాజీ తల్లి పేరు?జిజియాబాయి
మహారాష్ట్రను పాలించిన రాజారాం భార్య తారాబాయి
బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీకి అనుమతి ఇచ్చింది?ఎలిజబెత్‌–1
టిప్పుసుల్తాన్‌ తల్లి పేరు?ఫాతిమా ఫక్రున్నీసా
బ్రిటీష్‌ వారిని ఎదిరించిన కిత్తూరు రాణి?చెన్నమ్మ
గణపతిదేవుని పెద్ద కుమార్తె?గణపాంబ
లక్నో/అయోధ్యలో 1857 తిరుగుబాటులో తిరుగుబాటు చేసింది?బేగం హజ్రత్‌ మహల్‌
సర్‌ హ్యూగ్‌ రోజ్‌తో పోరాడిన ఝాన్సీ రాణి?లక్ష్మీబాయి / మనూబాయి / మణికర్ణిక
హన్మకొండలో కడలాలయ బసతి ఏర్పాటు చేసింది?మైలమ
1858 నుంచి భారతదేశ పాలన బాధ్యతలు నిర్వహించిన ఇంగ్లండ్‌ రాణి?విక్టోరియా మహారాణి
ప్రప్రథమ యక్షగాన కవయిత్రిబాల పాపాంబ (అక్కమహాదేవి చరిత్ర రాసింది)
కందుకూరి వీరేశలింగం తొలిసారి వివాహం చేసిన వితంతువు?సీతమ్మ (గౌరమ్మ) (ఈమె శ్రీరాములును వివాహమాడింది)
కందుకూరి వీరేశలింగం భార్య పేరు?రాజ్యలక్ష్మి
వివేకానందుని శిష్యురాలు?సిస్టర్‌ నివేదిత (మార్గరెట్‌ నోబుల్‌)
రామకృష్ణ పరమహంస అర్థాంగి?శారదాదేవి
అంబేద్కర్‌ తల్లి పేరు?భీమబాయి
దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధిగా భారత్‌ వచ్చిన ఐర్లాండ్‌ మహిళ?అనీబిసెంట్‌
భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా ఎవరిని కీర్తిస్తారు?సావిత్రిబాయి పూలే
బొంబాయిలో శారదా సదన్‌ను ఏర్పాటు చేసింది?పండిత రమాబాయి
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీ మహిళ?అనిబిసెంట్‌
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ?సరోజినీ నాయుడు
మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ తల్లి?అమాత్‌–ఉజ్‌–జహ్రున్నీసా బేగం
జవహర్‌లాల్‌ నెహ్రూ భార్య పేరు?కమలా నెహ్రూ




No comments:

Post a Comment