CURRENT AFFAIRS APRIL 2018-PART-1
1. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో అశోక్ లేలాండ్ తయారీ ప్లాంట్ కు ఇటీవల భూమి పూజ చేశారు?
సమాధానం: క్రిష్ణా
2. జీఎస్టీలో భాగంగా అంతర్రాష్ట్ర వస్తువుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ – వే బిల్లు విధానం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
సమాధానం: ఏప్రిల్ 1
3. దేశంలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ తన గ్యారేజ్ ను ఏ నగరంలో ప్రారంభించింది?
సమాధానం: హైదరాబాద్
4. క్రికెట్ ప్రపంచ కప్ – 2019 క్యాలిఫయర్ విజేత ఎవరు?
సమాధానం: అఫ్గనిస్తాన్
5. ఇటీవల భారత్ లో పర్యటించిన ఫ్రాంక్ వాల్టర్.. ఏ దేశ అధ్యక్షుడు ?
సమాధానం: జర్మనీ
6. 2018 సంవత్సరానికి పర్యాటకులు మెచ్చిన గమ్యస్థానాల అవార్డుల కోసం ట్రిప్ అడ్వయిజర్ సంస్థ ఎంపిక చేసిన 25 నగరాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న నగరం ఏది?
సమాధానం: పారిస్
7. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజుకి అందే వేతనం ఎంత?
సమాధానం: రూ. 205
8. కామన్వెల్త్ క్రీడలు – 2018లో తొలి స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రయాథ్లెట్ ఫ్లోరా ఏ దేశానికి చెందిన వారు?
సమాధానం: బెర్ముడా
9. ఫుట్ బాల్ జాతీయ చాంపియన్ షిప్ గా పరిగణించే సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది?
సమాధానం: కేరళ
10. దేవయాని ఘోష్.. ఇటీవల ఏ సంస్థ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు ?
సమాధానం: నాస్కామ్
11. కింది వాటిలోని ఏ సంస్థకు వినీత్ జోషి ఇటీవల డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు?
సమాధానం: ఎన్టీఏ
12. . ప్రతిష్టాత్మక అబెల్ బహుమతి – 2018కి ఎంపికైన రాబర్ట్ లాంగ్లాండ్స్ ఏ దేశానికి చెందిన వారు?
సమాధానం: కెనడా
13. అరబ్ దేశాల్లో మొదటి అణు రియాక్టర్ ఏది?
సమాధానం: బారక్
14. స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సిప్రీ.. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2013 – 2017 వరకు జరిగిన ఆయుధాల అమ్మకాల్లో ఏ దేశం తొలి స్థానంలో నిలిచింది ?
సమాధానం: అమెరికా
15. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
సమాధానం: నీతి ఆయోగ్
16. మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. ఇటీవల రెండో స్థానానికి చేరిన దేశం ఏది ?
సమాధానం: భారత్
17. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు శిక్ష పడే వరకు న్యాయస్థానంలో పోరాడిన బిష్ణోయ్ సమాజం ఏ రాష్ట్రానికి చెందినది?
సమాధానం: రాజస్తాన్
18. ప్రతిష్టాత్మక జే.సీ. డేనియaHaaల్ అవార్డ్ – 2017కు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
సమాధానం: శ్రీకుమరన్ థంపి
19. మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ – 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
సమాధానం: జాన్ ఇస్నర్
20. యూఎన్ పొలిటకల్ అఫైర్స్ విభాగానికి అధిపతిగా నియమితులైన తొలి మహిళగా ఇటీవల గుర్తింపు పొందిన రోస్ మేరీ డికార్లే.. ఏ దేశానికి చెందినవారు ?
సమాధానం: అమెరికా
21. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరపున వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి స్వర్ణం గెలిచింది. వెయిట్ లిఫ్టింగ్ లో ఆమెది ఏ విభాగం ?
సమాధానం: 48 కేజీల విభాగం
22. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
సమాధానం: హిమాంతా బిస్వ శర్మ
23. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని ఎయిర్ పోర్టుల్లో ఏది స్వచ్ఛ విమానాశ్రయంగా నిలిచింది?
సమాధానం: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
24. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రచయిత స్టీవెన్ బోచో ఏ దేశానికి చెందిన వారు?
సమాధానం: అమెరికా
25. భారత్, జపాన్, అమెరికా 9వ త్రైపాక్షిక చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి?
సమాధానం: న్యూఢిల్లీ
26. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కులు ఎవరు ?
సమాధానం: దీపక్ లాథర్
27. ఇండియన్ నేవీ ఇటీవల ఏ రాష్ట్రంతో కలిసి “చక్రవథ్ 2018” పేరుతో మానవ సహాయత, విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించింది?
సమాధానం: కేరళ
28. ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్స్ నియంత్రణ కోసం ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసింది ?
సమాధానం: సెక్రటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్
29. జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సమాధానం: ఏప్రిల్ 5
30. రిపబ్లిక్ ఆఫ్ సెర్బియాకు భారత అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
సమాధానం: సుబ్రతా భట్టాచర్జీ
31. యుద్ధ శిక్షణ కార్యక్రమం “గగన్ శక్తి – 2018” ను ఇటీవల భారత సైన్యంలోని ఏ విభాగం నిర్వహించింది?
సమాధానం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
32. ఇటీవల ఏ రాష్ట్రం గంగా హరిdsssswswతీమ యోజన (Ganga Greenery Scheme)ను ప్రారంభించింది ?
సమాధానం: ఉత్తర ప్రదేశ్
33. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సమాధానం: ఏప్రిల్ 7
34. ఇటీవల జరిగిన 21వ కామన్వెల్త్ పోటీల్లో 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ కు స్వర్ణం అందించిన రాగాల వెంకట రాహుల్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
సమాధానం: ఆంధ్రప్రదేశ్
35. కింది వారిలో భారత తొలి మహిళా డాక్టర్ ఎవరు?
సమాధానం: ఆనంది గోపాల్ జోషి
36. అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి “సర్మత్” ను ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
సమాధానం: రష్యా
37. కడక్ నాథ్ కోడి పై భౌగోళిక గుర్తింపుని ఇటీవల ఏ రాష్ట్రానికి జారీ చేశారు?
సమాధానం: మధ్యప్రదేశ్
38. ఏ సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ – 6 ఇంధన వినియోగం తప్పనిసరి కానుంది?
సమాధానం: 2020
39. ఇటీవల భారత్ లో ని ఏ నగరంలో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది?
సమాధానం: హైదరాబాద్
40. కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను కట్టుదిట్టం చేసేందుకు ఇటీవల సెబీకి సిఫార్సులను అందజేసిన కమిటీ ఏది ?
సమాధానం: ఉదయ్ కొటక్ కమిటీ
41. కింది వాటిలోని ఏ బ్యాంకుకు చందా కొచ్చర్ సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్నారు?
సమాధానం: ఐసీఐసీఐ
42. బాల్ టాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను నిషేధానికి గురైన ఆటగాడు / ఆటగాళ్లు ఎవరు?
సమాధానం: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్
43. ఇటీవల కన్నుమూసిన పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా బ్రౌన్.. ఏ దేశానికి చెందినవారు ?
సమాధానం: అమెరికా
44. అవినీతి కేసులో ఇటీవల 24 ఏళ్ల జైలు శిక్ష పడిన పార్క్ గుయెన్ హై.. గతంలో ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు ?
సమాధానం: దక్షిణ కొరియా
45. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన ఉగ్రవాద దేశాల జాబితాలో ఏ దేశం తొలి స్థానంలో ఉంది?
సమాధానం: పాకిస్తాన్
46. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
సమాధానం: 10 వేల మందికి
47. కింది వాటిలోని ఏ జట్టు ఐపీఎల్ సీజన్ – 11లో తిరిగి పునరాగమనం చేసింది?
సమాధానం: చెన్నై సూపర్ కింగ్స్
48. మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
సమాధానం: మానుషి చిల్లర్
49. గ్లోబల్ లాజిస్టిక్స్ సమ్మిట్ – 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది?
సమాధానం: న్యూఢిల్లీ
50. ఇటీవల భారత్ లో మూడు రోజుల పాటు పర్యటించిన నేపాల్ ప్రధానమంత్రి ఎవరు?
సమాధానం: ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి