ఏపీ డీఎస్సీ సిలబస్‌లో మార్పులు

ఏపీ డీఎస్సీ సిలబస్లో మార్పులు

www.telugumaterials.com

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించిన సిలబస్లో మార్పులు చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో మేరకు నిపుణుల కమిటీలు అధ్యయనం సాగిస్తున్నాయి. 2012లో ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ నిర్వహించి పోస్టుల వారీగా సిలబస్ ప్రకటించారు. తరువాత 2015లో డీఎస్సీని ప్రకటించారు.అయితే టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహించాల్సి ఉండగా.. దాన్ని డీఎస్సీతో కలిపి రెండింటినీ ఒకే పరీక్షగా పెట్టారు. దానికి టీచర్ ఎలిజిబులిటీ కమ్ రిక్రూట్మెంటు టెస్టు (టెర్ట్)గా నామకరణం చేశారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్), టీచర్ రిక్రూట్మెంటు టెస్టు (డీఎస్సీ) సిలబస్ రెండింటినీ కలిపి ఒకే సిలబస్గా ప్రకటించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు, పిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 200 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టెట్లో డీఎస్సీకి 20 శాతం వెయిటేజీ ఉన్నందున పరీక్షల్లో విద్యార్థులు సాధించినమార్కులకు 20 శాతం వెయిటేజీని కలిపి మెరిట్ జాబితా ప్రకటించారు. అంతకు ముందు టెట్ రాసి ఎక్కువ మార్కులు సాధించిన వారుంటే వారికి మార్కులు కలిపి మెరిట్ లిస్టు ప్రకటించారు.ఓసీలకు 60శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులకు 40 శాతం అర్హతా మార్కులు రావాలనే నిబంధన పెట్టారు. కాగా ఈసారి డీఎస్సీని వేరేగా నిర్వహిస్తున్నందున పరీక్షల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో 100 మార్కులుగా నిర్ణయించి పరీక్షలను 80 మార్కులకు నిర్వహించి.. మిగతా 20 మార్కులను టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులనుంచి కలిపే వారు. ఈసారీ అదే విధంగా 80 మార్కులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించి తక్కిన మార్కులను టెట్నుంచి కలపనున్నారు.


సిలబస్లో మార్పులు ఇలా...
డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా.. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తూ..నోటిఫికేషన్కు ముందే సిలబస్ను సిద్ధం చేస్తోంది. గతంలో టెర్ట్ను పెట్టినందున అందులోని టీచర్ ఎలిజిబులిటీ టెస్టు సిలబస్ను మినహాయించి రిక్రూట్మెంటు సిలబస్ను డీఎస్సీకి పెట్టనుంది. సిలబస్లోనూ కొన్ని మార్పులు చేయాలని యోచిస్తోంది. ఇప్పుడు జనరల్ నాలెడ్జి, మెథడాలజీ, సబ్జెక్టు కంటెంట్లు ఉంటాయి. టెర్ట్లో సైకాలజీని విసృ్తతమైన సిలబస్గా పెట్టారు. సైకాలజీ సబ్జెక్టును టెట్లోకి మార్పు చేసిపర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్అంశాలను డీఎస్సీలో పెట్టనున్నారు. అందులోనూ విస్తారమైన అంశాలను తగ్గించిఅప్లికేషన్ సైకాలజీని ఉంచేలా ఆలోచన చేస్తున్నారు. టెర్ట్లోని అంశాలు గ్రూప్-1, గ్రూప్-2 పరక్షలకు పెట్టేలా ఉండడంతో దాన్ని కుదిస్తున్నారు. క్లాస్రూమ్ సైకాలజీ వరకు ఉంటే సరిపోతుందనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు



కాన్సెప్ట్లు ఎక్కడివరకు ఉండాలో నిర్ణయం
గతంలో కాన్సెప్ట్ ఎక్కడివరకు ఉండాలన్న స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు ఎస్జీటీ అంటే స్కూల్ లెవెల్ (టెన్‌‌ వరకు), స్కూల్ అసిస్టెంటు అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అని ఫిక్స్ చేస్తున్నారు. ఎస్జీటీలకు అన్ని సబ్జెక్టులు కలిపి ప్రశ్నలుంటాయి. మీడియం అయినా అన్ని సబ్జెక్టుల మెథడాలజీలు నేర్చుకుని ఉంటారు కనుక వారు 8 నుంచి 10 తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. టెన్‌‌ వరకు ఉన్న సబ్జెక్టుల్లో వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించేలా సిలబస్ ఉండనుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఇంటర్మీడియట్ వరకు ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ఉంటుంది.