Biology Bits - వృక్ష శరీర ధర్మ శాస్త్రం

వృక్ష శరీర ధర్మ శాస్త్రం

Biology Bits


S.No
QUESTION
ANSWER
1
బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు జరుగుతుంది?
ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్థ్రతలో
2
నీటిలో కరిగే వర్ణద్రవ్యం ఏది?
పైకోబిలిన్లు
3
ల్యూటైన్ అనేది ఒక..
పసుపు రంగు వర్ణద్రవ్యం
4
ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ పిరేషన్‌ను ఏమని పిలుస్తారు?
స్టోమాటల్ ట్రాన్సిఫిరేషన్
5
కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువేది?
ఆక్సిజన్
6
ఎండాకాలంలో చెట్టునీడకు వెళితే చల్లగా ఉంటుంది. దీనికి కారణమైన ప్రక్రియ ఏది?
బాష్పోత్సేకం
7
క్లోరోఫిల్‌లో ఉండే మూలకం ఏది?
మెగ్నీషియం
8
మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే అవి..
ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి
9
మనల్ని సజీవంగా ఉంచే O2 అనేది కిరణజన్య సంయోగ క్రియ ఫలితం. ఇది దేని నుంచి లభిస్తుంది?
నీరు
10
`మొక్కలు ఎక్కువగా ఏ రకమైన కాంతిని గ్రహిస్తాయి?
నీలం, ఎరుపు
11
మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియను ఏమంటారు?
బాష్పోత్సేకం
12
ఒక చెట్టు బెరడులో కొంత భాగాన్ని కాండంపై తొలగిస్తే.. ఆ మొక్క చనిపోతుంది. దీనికి కారణం?
పత్రాల్లో సంశ్లేషించిన ఆహార పదార్థాలు వేర్లకు చేరకపోవడం
13
 మృత్తిక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
పెడాలజీ
14
మొక్కల ఆరోగ్యమైన పెరుగుదలకు అవసరమైన నేల ఏది?
లోమ్ నేల
15
నేలలోని నత్రజని స్థాపక జీవులు వేటికి చెందినవి?
బ్యాక్టీరియా
16
నీరు, గాలి వల్ల మృత్తిక తొలగిపోవడాన్ని ఏమంటారు?
క్రమక్షయం
17
నత్రజని స్థాపనకు అవసరమయ్యే ఖనిజ మూలకం ఏది?
మాలిబ్డినమ్
18
మొక్కలకు అతి ఎక్కువగా అవసరమయ్యే మూలకం ఏది?
నైట్రోజన్
19
 పత్రహరితం సంశ్లేషణకు అవసరమయ్యే మూలకాలేవి?
Fe, Mg
20
పంట మార్పిడి ఆవశ్యకత ఏమిటి?
భూసారాన్ని పెంచడం
21
ఏ మూలకం లోపించడం వల్ల లఘు(చిన్న) పత్ర వ్యాధి వస్తుంది?
జింక్
22
వేర్లు గ్రహించిన నీరు, ఖనిజ మూలకాలు వేటి ద్వారా పత్రాలకు రవాణా అవుతాయి?
దారువు
23
ఒక కణాన్ని అధిక గాఢత ఉన్న ద్రావణంలో ఉంచినప్పుడు జరిగే క్రియ..
కోశిక ద్రవ్య సంకోచం
24
ఏ ప్రక్రియ జరగకపోవడం వల్ల రబ్బరు నీటిలో వ్యాకోచం చెందదు?
నిపానం
25
పొడి విత్తనాలను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బడానికి కారణమైన ప్రక్రియ ఏది?
నిపానం
26
మొక్కల వేర్లు భూమి నుంచి నీటిని పీల్చుకోవడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?
ద్రవాభిసరణం
27
పచ్చళ్లు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి (బ్యాక్టీరియా నశించడానికి) కారణమైన ప్రక్రియ?
కోశిక ద్రవ్య సంకోచం (బాహ్య ద్రవాభిసరణం)
28
మొక్కల్లో వేరు పీడనాన్ని కొలిచే సాధనం
మానోమీటర్
29
కోసిన మొక్క కొన భాగం నుంచి దారురసం కారడానికి కారణం..
వేరుపీడనం
30
 పత్రంలో పత్రరంధ్రాలు తెరచుకోవడాన్ని నియంత్రించే కణాలేవి?
రక్షక కణాలు

Download Above Questions As PDF



No comments:

Post a Comment