తెలంగాణ పోలీస్ కొలువుల సంబురం: 18,428 పోలీసు ఉద్యోగాలకు ప్రకటన జారీ

18 వేల పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
TSPSC SI Constable Notification In telugu


రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర మొదలైంది. మేరకు 18,428 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మే 31 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులుండగా, 1217 ఎస్ పోస్టులున్నాయి. అలాగే కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ 142, మెకానిక్ 19, డ్రైవర్ కు సంబంధించి 70 పోస్టులున్నాయి.


కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 22 సంవత్సరాలు కాగా ఎస్ఐ పోస్టులకు 21 నుంచి 25 సంవత్సరాలుండాలి. ఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలి. అభ్యర్థులు జూన్ 9 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.500, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.1000 చెల్లించాలి. అలాగే కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.800 చెల్లించాలి. మరిన్ని వివరాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ www.tslprb.in చూడొచ్చు



కానిస్టేబుల్ పోస్టుల వివరాలు 
సివిల్
5909
ఏఆర్
5273
ఎస్ఏఆర్- ఎస్పీఎల్
53
టీఎస్ఎస్పీ
4816
ఎస్పీఎఫ్
485
ఫైర్మెన్
168
జైల్ వార్డర్స్ (పురుషులు)
186
జైల్ వార్డర్స్ (మహిళలు)
35
మొత్తం
16925

TSPSC SI Notification Download Here


ఎస్సై ఉద్యోగాలకు అర్హతలు 


  • వయో పరిమితి (2018 జులై 1వతేదీ నాటికి) 
  • పోలీసుశాఖలో ఎస్సై పోస్టులకు 21 సంవత్సరాలు నిండి, 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. 1993 జులై 2, 1997 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. 
  • అగ్నిమాపక విపత్తు నివారణశాఖలో స్టేషన్ఫైర్ఆఫీసర్పోస్టులకు 2018 జులై 1నాటికి 18 సంవత్సరాలు నిండి, 30 ఏళ్లలోపు ఉండాలి. 1988 జులై 2, 2000 సంవత్సరం జులై 1వతేదీ మధ్య జన్మించి ఉండాలి. 
  • జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్పోస్టులకు 21 సంవత్సరాలు నిండి, 30 ఏళ్లలోపు ఉండాలి. 1988 జులై 2, 1997 జులై 1 తేదీల మధ్య జన్మించి ఉండాలి. 
  • జైళ్లశాఖలో అసిస్టెంట్మ్యాట్రన్పోస్టులకు 21 సంవత్సరాలు నిండి, 25 ఏళ్లలోపు ఉండాలి. 1993 జులై2, 1997 జులై1 తేదీ మధ్య జన్మించి ఉండాలి.



విద్యార్హతలు 
  • గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే ఇంటర్ లేదా తత్సమానమైన కోర్సు చదివి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వీరు మాత్రం పాలిటెక్నిక్ వంటి దాని తర్వాత డిగ్రీ చేసి ఉండాలి.
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్సై పోస్టులకైతే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో ఏదో ఒకదానిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • వేలిముద్రల విభాగంలో అయితే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక పాఠ్యాంశంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఫీజు 


  • ఎస్సై, స్టేషన్ఫైర్ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌, అసిస్టెంట్మ్యాట్రన్పోస్టులకు దరఖాస్తు చేసుకునే తెలంగాణకు చెందిన ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000. 
  • ఎస్సీ, ఎస్టీలైతే రూ.500 
  • మిగతా అభ్యర్థులకు రూ.1000. 
  • టి.ఎస్‌.ఆన్లైన్‌, ఏపీ ఆన్లైన్‌, మీసేవా లేదా ఇంటర్నెట్బ్యాంకింగ్ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు.



ఎస్ పోస్టుల వివరాలు
ఎస్ (సివిల్)
710
ఎస్ (ఏఆర్)
275
ఎస్ (టీఎస్ఎస్పీ)
175
ఎస్ (టీఎస్ఎస్పీ-15 బెటాలియన్)
16
ఫైర్ ఆఫీసర్
19
డిప్యూటీ జైలర్స్
15
ఎస్ఏఆర్ఎస్పీఎల్
5
మొత్తం
1217

కానిస్టేబుల్ఉద్యోగాలకు అర్హతలు

  • వయోపరిమితి (2018 జులై 1వతేదీ నాటికి) 
  • కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 ఏళ్లు నిండి, 22 ఏళ్లలోపు ఉండాలి. 1996 జులై 2, 2000 సంవత్సరం జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
  • హోంగార్డుగా పనిచేస్తున్న వారైతే 18 సంవత్సరాలు నిండాలి. 40 ఏళ్లలోపు ఉండాలి.
  • అగ్నిమాపకశాఖలో ఫైర్మెన్, జైళ్లశాఖలో వార్డర్లు(పురుషులు, మహిళలు) పోస్టులకు 18 సంవత్సరాలు నిండి, 30 సంవత్సరాలలోపు వయసుండాలి. 1988 జులై 2, 2000 జులై 1 తేదీ మధ్య జన్మించి ఉండాలి.

  • పోలీసుశాఖలో సివిల్, .ఆర్.లతోపాటు జైళ్లశాఖలో వార్డర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించారు. వితంతువులు, చట్టబద్ధంగా విడాకులు పొందిన మహిళలైతే 18 ఏళ్లు నిండి, 40 సంవత్సరాలలోపు ఉండాలి.



 విద్యార్హతలు 

  • ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే పదో తరగతి పూర్తిచేసి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివి ఉంటే చాలు.


ఫీజు వివరాలు 

  • తెలంగాణకు చెందిన ఓసీ, బీసీలైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400, మిగతా అభ్యర్థులేతే రూ.800 చెల్లించాలి.
  • అన్ని పోస్టులకూ www.tslprb.in ద్వారా ఆన్లైన్లోనే జూన్ 9 నుంచి జూన్ 30 తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ల విధానం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత లభించిన వారికి దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి తుది పరీక్ష నిర్వహిస్తారు. టి.ఎస్.పి.ఎస్. విభాగంతోపాటు డ్రైవర్ల వంటి ఉద్యోగాలను పురుషులకు మాత్రమే కేటాయించారు. మిగతా అన్ని పోస్టులు పురుషులు, మహిళలూ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


వయో పరిమితి సడలింపు లేదు 


  • గత 2016 ఉద్యోగ ప్రకటనలో పోలీసు ఉద్యోగాలకు నాలుగేళ్ల వయోపరిమితి సడలింపునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రస్తుత ప్రకటనలో అలాంటి సడలింపు ఏదీ ఇవ్వలేదు.


TSPSC Constable Notification Download Here

Click Here to Visit Official Website for More Details.