Current Affairs April-5th-2018
మలబార్ గోల్డ్ అంబాసిడర్‌గా మానుషి చిల్లర్
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌స మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
ఈ మేరకు ఏప్రిల్ 5 న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా మానుషి బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు.
కృష్ణజింకల కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(52)కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
1998 నాటి కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నా’ అని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పు వెలువరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.
సైబర్ నేరాలకు కొత్త అస్త్రం క్రిప్టోజాకింగ్
సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు కొత్త పద్ధతులు వినియోగిస్తున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్ తెలిపింది.
సంప్రదాయ సైబర్ నేరాలతో సంపాదన తగ్గిపోతుండటంతో కొత్త పద్ధతుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ (ఐఎస్‌టీఆర్) పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ విధానంలో క్రిప్టోకరెన్సీ (బిట్‌కాయిన్) లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైందని తెలిపింది.
క్రికెట్ ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా
భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారహక్కులను అత్యధిక మొత్తానికి స్టార్ ఇండియా దక్కించుకుంది.
వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. దీంతో వచ్చే ఐదేళ్ల (2018-2023) లో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది.
No comments:
Post a Comment