Current Affairs: April 4th-2018







ఆర్‌బీఐ పాలసీరేట్లు యథాతథం


కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది.

రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) ని 4 శాతంగా కొనసాగించింది. ఏప్రిల్ 5న జరిగిన 2018-19........




కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి స్వర్ణం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది.

చాను మొత్తం (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్-170 కేజీలు) రజతం, దినుషా గోమ్స్ (శ్రీలంక-155 కేజీలు) కాంస్యం పొందారు.
పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249 కేజీలు (స్నాచ్‌లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా - 261 కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక-248 కేజీలు) కాంస్యం గెలిచారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో బెర్ముడా కు చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.

No comments:

Post a Comment