Current Affairs 9th April,2018

కామన్వెల్త్‌ గేమ్స్‌లో 5వ రోజు భారత్‌కు 7 పతకాలు

21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 5వ రోజు 2018 ఏప్రిల్‌ 9న భారత్‌ 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది.

  • బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో మలేసియాను ఓడించి బారత్‌ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. 
  • భారత పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు నైజీరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. 
  • పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో జితూరాయ్‌ స్వర్ణ పతకం, ఓం మితర్వల్‌ కాంస్య పతకం సాధించారు
  • మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో మెహులీఘోష్‌ రజతం, అపూర్వీ చండిలా కాంస్య పతకం సాధించింది
  • వెయిట్‌లిఫ్టింగ్‌ 105 కిలోల విభాగంలో ప్రదీప్‌సింగ్‌ మొత్తం 352 కిలోల బరువెత్తి రజత పతకం సాధించాడు
  • ఇప్పటి వరకు భారత్‌కు లభించిన పతకాలు


బ్రిటన్‌ రాణి మహమ్మద్‌ వారసురాలు

ప్రవక్త మహమ్మద్‌కు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 43వ తరం సంతానమని తాజా అధ్యయనమొకటి ఉద్ఘాటించింది. ప్రవక్త కుమార్తె ఫాతీమా ద్వారా కలిగిన సంతానమనీ, స్పెయిన్‌ను పాలించిన అరబ్‌ రాజు ఎలిజబెత్‌ పూర్వీకులేనని తేల్చింది.

  • ఈ విషయాన్ని తొలిసారిగా 1986లో ఓ ప్రచురణ సంస్థ అధినేత హరాల్డ్‌ బ్రూక్స్‌-బేకర్‌ కూడా నిర్ధరించారు.
  • తాజాగా చేసిన అధ్యయనంపై చరిత్రకారుడు అబ్దుల్‌-హమీద్‌ అల్‌-అవానీ రాసిన ప్రత్యేక కథనాన్ని మొరాకో పత్రిక అల్‌-ఒస్బుయ్‌ ఇటీవల ప్రచురించింది.


అమెరికా శాసనకర్తలకు ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ వాంగ్మూలం


  • డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కానీ, సంస్థ సభ్యులు కాని తగినంత కసరత్తు చేయలేదని ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 2018 ఏప్రిల్‌ 9న అమెరికా కాంగ్రెస్‌కు వెల్లడించారు. ఇందుకు శాసనకర్తలను క్షమాపణలు కోరారు.
  • తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పర్చుకోలేకపోయామని, అది పెద్ద తప్పేనని లిఖితపూర్వకంగా అందజేసిన వాంగ్మూలంలో అంగీకరించారు.
  • అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని గుర్తించి ప్రతిస్పందించడంలో ఫేస్‌బుక్‌ చాలా నిదానంగా ఉందని అంగీకరించారు.

CRPF శౌర్య దినోత్సవం

CRPF శౌర్య దినోత్సవ కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్‌ 9న న్యూడిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విధినిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. శౌర్యపతక గ్రహీతలను అభినందించారు.
CRPF ఏర్పాటు - 1939 జులై 27


ఈ-ఆధార్‌లో కొత్త క్యూఆర్‌ కోడ్‌

  • ఈ-ఆధార్‌ కార్డులో ప్రస్తుతమున్న క్యూఆర్‌ కోడ్‌ స్థానంలో సురక్షితమైన డిజిటల్‌ సంతకంతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రవేశపెట్టింది.
  • క్యూఆర్‌ కోడ్‌ అనేది గీతతో కూడిన కోడ్‌. దీన్ని ఎలక్ట్రానిక్‌ యంత్రంతో స్కాన్‌ చేస్తే అందులో నిక్షిప్తం చేసిన వివరాలు కనిపిస్తాయి.
  • ప్రస్తుత క్యూఆర్‌ కోడ్‌లో వ్యక్తి వివరాలు మాత్రమే ఉంటున్నాయి. మార్చిన కోడ్‌లో ఆధార్‌ కార్డుదారుడి ఫొటో కూడా ఉంటుంది.

గిరిజనులకు వైద్య సేవల కొరకు ఆరోగ్య రథాలు ప్రారంభం


  • ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద 2 ఆరోగ్య రథాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్‌ 9న అమరావతిలో వీటిని జెండా ఊపి ప్రారంభించారు.
  • గిరిజన గ్రామాల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆరోగ్య రథాలు సేవలందిస్తాయి.
  • ఈసీజీ, మూత్ర, రక్త తదితర 200 రకాల పరీక్షలను వీటిలో నిర్వహిస్తారు. డిస్పెన్సరీ కూడా అందుబాటులో ఉంటుంది.
  • మలేరియా, మధుమేహం, రక్తపోటు, క్షయ, క్యాన్సర్‌ తదితర రోగాలను ప్రారంభంలోనే గుర్తించి వాటితో బాధపడుతున్న వారిని ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్యసేవకు బదలాయిస్తారు.

No comments:

Post a Comment