Current Affairs: 15th April-2018


1. కామన్వెల్త్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు



కామన్వెల్త్ గేమ్స్‌లో ఏప్రిల్ 13 న జరిగిన పలు ఈవెంట్‌లలో భారత్ మూడు స్వర్ణాలను గెలుచుకుంది.

  • 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా(హరియాణా) 30 పాయింట్ల స్కోరు చేసి స్వర్ణం సాధించాడు.
  • ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు భారత్ నుంచి స్వర్ణం గెలిచిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
  • మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో తేజస్విని(మహారాష్ట్ర) 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును చేధించడంతో పాటు స్వర్ణ పథకాన్ని గెలిచింది. 
  • ఈ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది.
  • రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10-0తో మూడు నిమిషాల్లోపే బౌట్‌ను ముగించాడు.

2. ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు

సింగపూర్‌లో ఏప్రిల్ 13న జరిగిన ‘ హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్’ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

  • ఈ సందర్భంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్, ఇతర ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ కార్యకలాపాలను విస్తరించేందుకు త్వరలో ఏపీకి తమ బృందాన్ని పంపుతామని టోనీ బ్లెయిర్ చెప్పారు.

3. పాకిస్తాన్ మాజీ ప్రధాని షరీఫ్ పై నిషేధం


పనామా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆ దేశ సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.

  • షరీఫ్‌తో పాటు పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్‌పై కూడా రాజకీయ నిషేధం విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
  • పనామా పేపర్స్ కేసులో షరీఫ్ 2017 జూలై 28న తన ఎంపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు.
  • పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చట్టసభ్యుడిపై నిషేధం విధించవచ్చు.

4. ముగ్గురు భారతీయులకు ఐషో పురస్కారాలు

భారత్‌కు చెందిన ముగ్గురు ఆవిష్కర్తలు దావ్లే (థింకర్ బెల్ ల్యాబ్స్, బెంగళూరు), బాలాజీ తీగల(బ్రున్ హెల్త్, న్యూఢిల్లీ), వినాయక్ నందాలికే (యోస్త్రా ల్యాబ్స్, బెంగళూరు) అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్(ఏఎస్‌ఎంఈ) ఇన్నోవేషన్ షోకేస్ అవార్డులకు ఎంపికయ్యారు.

  • ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తూ ఏఎస్‌ఎంఈ 2018 సంవత్సరానికి ఈ పురస్కారాలను ప్రకటించింది.
  • దావ్లే ఆడియో టాక్టిల్ డివైజ్‌ను రూపొందించారు. దీనిపై రాసే బ్రెయిలీ లిపిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవడంతో పాటు దీనిలో డిజిటల్ బ్రెయిలీ పలక, బ్రెయిలీ కీబోర్డు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. 
  • బాలాజీ నవజాత శిశు మరణాల రేటు తగ్గించే లేబర్ డిటెక్షన్ టూల్‌ను రూపొందించగా, వినాయక్ ఫోర్టబుల్ మెడికల్ పరికరాన్ని తయారు చేశారు. ఇది మధుమేహ రోగులలో వచ్చే నరాల వ్యాధిని, దాని లక్షణాల ద్వారా ముందే పసిగడుతుంది.

5. కోహ్లీ, మిథాలీకు ‘విజ్డెన్’ పురస్కారం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల సారథి మిథాలీ రాజ్ లు ప్రఖ్యాత క్రికెట్ మేగజైన్ ‘విజ్డెన్’ పురస్కారాలకు ఎంపికయ్యారు.

  • దీంతో సెహ్వగ్ (2008, 2009) తర్వాత ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ పురస్కారాన్ని వరుసగా రెండుసార్లు అందుకున్న భారత క్రికెటర్‌గా కోహ్లీ (2017, 2018) నిలిచాడు.
  • మహిళల క్రికెట్‌లో అత్యధిక అర్థసెంచరీలు, పరుగులు చేసిన మిథాలీ ‘లీడింగ్ విమెన్ క్రికెటర్’గా నిలిచింది.
  • అలాగే అఫ్గానిస్తాన్‌కి చెందిన రషీద్ ఖాన్ ‘ఫార్‌మోస్ట్ టి20 ప్లేయర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు.

6. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతం

భారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

  • పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ (రీప్లేస్‌మెంట్) బరువు 1,425 కిలోలు. ఇందులో ఎల్5, ఎస్‌బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియరం పరమాణు గడియారాలు, సీబ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రెఫ్లెక్టర్లున్నాయి.
  • దీని పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.
  • నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను 2013 జులై 1న కక్ష్యలోకి పంపారు.
  • ఇందులో సమయాన్ని నిర్ధరించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో 2017 ఆగస్టు 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహంను ప్రయోగించారు. 

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపయోగాలు

  1. నింగి, నేల, నీటిలో కూడా నావిగేషన్ సేవలు అందిస్తుంది.
  2. సైనికులకు ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని చూపిస్తుంది.
  3. మత్స్యకారులు, విపత్తు నిర్వహణ సేవలను అందిస్తుంది.
  4. వాహనాల గమనం, మొబైల్ ఫోన్లతో వాహనాల అనుసంధానం.
  5. మ్యాపింగ్ వంటి తదితర సేవలు కూడా పొందవచ్చు.

7. సింగరేణి సీఎండీకి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు

సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు వరించింది.

  • ఆసియాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల పనితీరు ఆధారంగా గనులు, ఇంధనం విభాగాల్లో ఉత్తమ ప్రతిభ, అసమాన కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు ఎంటర్‌ప్రైజ్ ఆసియా కంపెనీ ప్రకటించింది.

No comments:

Post a Comment