- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నూతన సభ్యురాలిగా 1982 బ్యాచ్ కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం.సత్యవతి నియమితులయ్యారు.
- ఎం.సత్యవతి కేంద్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వహించారు. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన మొదటి మహిళ సత్యవతి.
- UPSC చైర్‌పర్సన్ - వినయ్ మిట్టల్
CISF డైరెక్టర్ జనరల్‌గా రాజేష్ రంజన్
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నూతన డైరెక్టర్ జనరల్‌గా 1994 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజేష్ రంజన్ నియమితులయ్యారు.
- 2020 నవంబర్ 30 వరకు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు.
- 2018 జనవరిలో ఒ.పి.సింగ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి వైదొలగి ఉత్తరప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
ప్రపంచ హోమియోపతి దినోత్సవం
- ప్రపంచవ్యాప్తంగా 2018 ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించారు. జర్మన్ ఫిజిషియన్ డా॥ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతిని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తారు.
- ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూడిల్లీలో ఏప్రిల్ 10, 11 తేదీల్లో 2 రోజుల సదస్సును నిర్వహించారు.
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ఈ సదస్సు యొక్క థీమ్ - Innovate: Evolve, Progress: Exploring Science since 40 years
BFA చైర్మన్‌గా బాన్ కీ మూన్
- బోవో ఫోరమ్ ఫర్ ఆసియా చైర్మన్‌గా ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఎన్నికయ్యారు.
- బాన్ కీ మూన్ జపాన్ ప్రధాని యసువో ఫుకుడాపై విజయం సాధించారు.
- బోవో ఫోరమ్ ఫర్ ఆసియా ఆసియా దేశాల మధ్య ఆర్థిక సమైక్యతను ప్రోత్సహించటానికి మరియు ఆసియా దేశాలను అభివృద్ధి లక్ష్యాలకు చేరువగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేసే సంస్థ.
- 2018 బోవో ఫోరమ్ ఫర్ ఆసియా సదస్సు థీమ్ - Open and Innovative Asia for a World of Greater Prosperity
నేపాల్‌లో 2018 అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం
- దక్షిణాసియాలో 2018 అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం 2018 ఏప్రిల్ 9 నుంచి 11 వరకు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించారు.
- నేపాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నిర్వహించిన ఈ సమావేశంలో భారత్ సహా 20 దేశాలకు చెందిన మానవ హక్కుల ప్రతినిధులు పాల్గొన్నారు.
- ఈ సమావేశం యొక్క థీమ్ - Identifying Challenges, Assessing Progress, Moving Forward: Addressing Impunity and Realizing Human Rights in South Asia
చెరువుల్లో చేరే వ్యర్థాలపై అధ్యయనానికి కమిటీ
- చెరువుల్లో చేరే పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వినియోగ వ్యర్థాలపై అధ్యయనం చేయడంతో పాటు దానిని సవరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది.
- చెరువుల్లో చేరే వ్యర్థాలు, ఎదురయ్యే సమస్యలను నివారించే విషయమై ప్రభుత్వానికి ఈ కమిటీ ప్రతి 15రోజులకు ఒకసారి నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు మునిసిపల్ శాఖ 2018 ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
8 పంచాయతీరాజ్ సంస్థలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికిరణ్ జాతీయ అవార్డులు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికిరణ్ జాతీయ పురస్కారాల్లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట మండలం మరోసారి సత్తాచాటింది. మండలాల కోటాలో సిద్దిపేటకు, గ్రామాల కోటాలో ఇర్కోడ్‌కు అవార్డులు దక్కాయి. సిద్దిపేట మండలం, ఇర్కోడ్ గ్రామం సహా రాష్ట్రంలోని 8 పంచాయతీరాజ్ సంస్థలకు అవార్డులు దక్కాయి.
- జిల్లా కోటాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్.. మండలాల కోటాలో సిద్దిపేట, శ్రీరాంపూర్, గ్రామపంచాయతీ కోటాలో ముష్టిపల్లి (సిరిసిల్ల జిల్లా), ఇర్కోడు (సిద్దిపేట జిల్లా), కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా), గంటల్‌పల్లి (రంగారెడ్డి జిల్లా), వెలిచాల (కరీంనగర్ జిల్లా)కు పురస్కారాలు దక్కాయి.
- కరీంనగర్ జిల్లాలోని దుద్దెనపల్లికి నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం లభించింది.
- అవార్డు కింద జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు.. మండలాలకు రూ.25 లక్షల చొప్పున.. గ్రామ పంచాయతీకురూ.8-12 లక్షల చొప్పున నిధులు అందజేస్తారు.
- ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ప్రధాని ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
No comments:
Post a Comment